సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్
నిర్మల్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు చేస్తోంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ జ్ఞానేష్ కుమార్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Lనిరసనలో భాగంగా జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వేద్మ బోజుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
— రిజ్వాన్ అహ్మద్,
E6tv NEWS, ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి.

