Breaking News

Delhi Protest Live:ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి నిరసన మార్చ్…!

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ‘ఇండియా’ కూటమి తలపెట్టిన నిరసన మార్చ్ నేపథ్యంలో న్యూఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పలు కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. బరాఖంబ రోడ్, మండి హౌస్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు, పౌర సమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి శాంతియుతంగా మార్చ్‌లో పాల్గొనాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితాలో కోల్పోయిన హక్కులను పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున నేరుగా పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలపడంతో, ప్రతిపక్షాల విజ్ఞాపన పత్రం అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు వైపు తమ నిరసన మార్చ్‌ను కొనసాగిస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *