Breaking News

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జి. గౌతమికి అవార్డు

గుమ్మిరాల గ్రామంలో ఘనంగా సన్మానం.. విద్యార్థులకు బెల్టులు, టైలు పంపిణీ

ఏర్గట్ల, అక్టోబర్ 9(E6tv NEWS: ప్రతినిధి).

బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం గుమ్మిరాల గ్రామానికి చెందిన జి. గౌతమి, ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు పొందిన సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ దేశబోయిన జమున సంజీవ్ తరఫున, పాఠశాల యాజమాన్యం, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ సంతోష ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత జి. గౌతమిని శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందడం పాఠశాలకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.అనంతరం ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బెల్టులు, టైలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఎంఈఓ ఆనందరావు, హెచ్‌ఎం కే. కృష్ణాచారి, ఉపాధ్యాయులు కార్తీక్, నిత్యానంద్, మమత, నవనీత, జ్యోత్స్న, అంగన్‌వాడీ టీచర్ సంతోష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *