Breaking News

జ్ఞానప్రదాయినిగా దుర్గాభవాని.. తెల్లని చీరలో సరస్వతీ దేవిగా దివ్యదర్శనం!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS).

ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు దేవునిపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. త్రినేత్రి దుర్గాభవాని మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన అమ్మవారు ఉత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.తెల్లని చీరలో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పురోహితుడు రమేష్ శర్మ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి 72 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల్లో భాగంగా ఇప్పటివరకు 36 మంది భక్తులు మాలధారణ చేయగా, వారిలో తొమ్మిది మంది మహిళా భక్తులు ఉన్నారు. సుమారు 200 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు.

శరన్నవరాత్రి ఉత్సవాలతో దేవునిపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

– E6tv NEWS, ఎల్లారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *