వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఆధారాలతో నిరూపించాలి.. నిజనిర్ధారణ కమిటీ వేయాలి
రాజకీయాలు, వ్యాపారాన్ని ముడిపెట్టడం సరికాదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి
నిజామాబాద్: అక్టోబర్ 8:(E6tv NEWS: శివ ఠాకూర్).
తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ప్రస్తుతం రైస్ మిల్ నిర్వహిస్తూ, రైతులకు అండగా నిలుస్తున్నానని పేర్కొంటూ, తనపై వస్తున్న వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలపై రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తనపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయ జీవితం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్థాయిలో విచారణ జరిపించి తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అదే సమయంలో ఆరోపణలు నిరాధారమని తేలితే సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతు కుటుంబం నుంచి వచ్చాను
తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, రైతుల సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాను పనిచేస్తున్నానని చెప్పారు. గతంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.తన వ్యక్తిగత జీవితం, వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ముఖ్యంగా రాజకీయ నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
MSPపై కూడా ప్రస్తావన
రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై కూడా మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ధాన్యానికి మద్దతు ధర విషయంలో రైతులకు స్పష్టత, న్యాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. MSP విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ₹2,460 ఇస్తుంటే, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప మద్దతు ధర ₹3,160గా ఉందని పేర్కొంటూ, రాష్ట్రంలో బిజెపి పార్టీ ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు వ్యక్తులు, పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కావాలనే తనపై వ్యక్తిగతంగా, రాజకీయంగా,కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలి
తనపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిరాధార ఆరోపణలని తేలితే ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.BRS నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా విభేదాలు ఉండటం సహజమేనని, అయితే వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టి చూడటం సరికాదన్నారు.
ఇకపై రాజకీయంగా సత్తా చూపిస్తాం
ఇప్పటివరకు తాను రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదని, అయితే ఇక నుంచి రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సంవత్సరం నుండి 2023 లో జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో సమర్పించిన అబ్డోవేట్ లు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఎక్కడైనా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే బీజేపీ తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద గుప్తా, కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి, మర్చంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లాబిశెట్టి శ్రీనివాస్, నిజామాబాద్ గోశాల అధ్యక్షుడు పవన్ కేడియా, సూరజ్ అగర్వాల్, బచ్చు వెంకటేష్, కాపర్తి జగన్, సురేందర్ సూర్, సూర్యం, చందు, ప్రణయ్, రైస్ మిల్ ఓనర్లు, తదితరులు పాల్గొన్నారు.


