Breaking News

ఆరోగ్య రంగంలో వైఫల్యాలపై తెలంగాణ ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం, విద్యారంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, ఇది “చేతగాని, సంపూర్ణంగా విఫలమైన ప్రభుత్వం” అని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఎండగట్టేందుకు రాష్ట్రవ్యాప్త నిరసన ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె ప్రకటించారు.

ముఖ్యమైన ఆరోపణలు & కార్యాచరణ:

  • ఆర్టీఐ డేటా ఆధారంగా శిశు మరణాలపై ఆందోళన: సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన వివరాలను వెల్లడిస్తూ… ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏటా దాదాపు 4,000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే 2024-25లో 0-1 సంవత్సరంలోపు చిన్నారుల మరణాలు 1,046గా నమోదయ్యాయని తెలిపారు.
  • ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు – నిధుల కోత: ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్ నిధులను సరిగా వినియోగించడం లేదని, పలు పథకాలకు నిధులు సున్నాగా మార్చారని విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కాకపోవడం వల్ల సర్కారీ ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందన్నారు.
  • ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శన: మంగళవారం నుండి టీఆర్ఎస్ నాయకులు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి సమస్యలను ఫోటోలు, వీడియోలతో సహా ఎండగడతారని స్పష్టం చేశారు.
  • బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు: సర్కారీ బడుల్లో గర్ల్స్ టాయిలెట్లు, శానిటరీ నేప్‌కిన్ డిస్పోజల్ సదుపాయాలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. అవసరమైతే తామే విరాళాలు సేకరించి, జోలె పట్టి అయినా విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు.
  • ఉచిత వైద్యం & ఖైరతాబాద్ ఉపఎన్నిక: ప్రభుత్వం నుండి సబ్సిడీ భూములు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు 25 శాతం ఉచిత చికిత్స కోటాను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *