Breaking News

డి-46 కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి

ఆకుల గోపాల్‌ను తిరిగి కాలువ ఇన్‌స్పెక్టర్‌గా నియమించాలి

నీటిపారుదల శాఖ అధికారికి రైతుల వినతి…

ఎడపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ప్రధాన కాలువ నుంచి డి-46 ఉపకాలువకు సాగునీరు చేరుతుంది. ఈ కాలువ ఆయకట్టు కింద ఎడపల్లి, దుబ్బతండా, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు బోధన్ మండలంలోని పెంటకలాన్, పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ సకాలంలో సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎడపల్లి, బోధన్ మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు బోధన్ నీటిపారుదల శాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. డి-46 కాలువ పర్యవేక్షణ ఇన్‌స్పెక్టర్‌గా గతంలో పనిచేసిన ఆకుల గోపాల్‌ను తిరిగి అదే విధుల్లో నియమించాలని కోరారు. ఆయన బదిలీ అనంతరం కాలువ పర్యవేక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు.డి-46 ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు కూడా సకాలంలో సాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటలు కోత దశకు చేరుకునేలోపు అవసరమైన నీటిని విడుదల చేయాలని కోరారు.

ప్రస్తుతం బోధన్ నీటిపారుదల శాఖలో అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్లే సాగునీటి సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయని రైతులు ఆరోపించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి డి-46 ఆయకట్టు చివరి భూములకు నీరందించాలని, ఆకుల గోపాల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *