Breaking News

గాంధీ జయంతి సందర్భంగా మంత్రి సవిత నివాళులు

పెనుకొండ, అక్టోబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి)

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ప్రజలు ఆచరించాలని సూచించారు.

అనంతరం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులను మంత్రి సవిత సన్మానించి, గిఫ్ట్ బాక్సులను అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆమె పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర ఎంతో కీలకమని అన్నారు.మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత నిర్మాణంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో ముఖ్యమైనవని మంత్రి సవిత తెలిపారు. వారి కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *