కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలకు గాను 507 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించారు.
పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి అత్యధికంగా 293 నామినేషన్లు నమోదవ్వగా, వైఎస్సార్సీపీ తరఫున 178 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే జనసేన పార్టీ నుంచి 17, బీజేపీ తరఫున 10, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 9 నామినేషన్లు సమర్పించారు.
మండలాల వారీగా నామినేషన్ల వివరాలు:
- కుప్పం మండలం: 21 స్థానాలకు 201 నామినేషన్లు
- శాంతిపురం మండలం: 18 స్థానాలకు 121 నామినేషన్లు
- గుడిపల్లి మండలం: 13 స్థానాలకు 98 నామినేషన్లు
- రామకుప్పం మండలం: 16 స్థానాలకు 87 నామినేషన్లు
నాలుగు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో, అభ్యర్థులు అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల తదుపరి దశపై పడింది.
