Breaking News

ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా తరలిన MSF విద్యార్థి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “హాలో విద్యార్థి – చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువ నాయకులు భారీగా తరలివెళ్లారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోంపూర్ పోచిరాం మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

బాన్సువాడ నియోజకవర్గం నుంచి కోటగిరి, పోతంగల్ మండలాలకు చెందిన పలువురు MSF విద్యార్థి, యువ నాయకులు కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్లారు. వారిలో నేరెళ్ల అశోక్ మాదిగ, పోశెట్టి మాదిగ, సీనియర్ నాయకులు నాగయ్య సార్, ఎన్. హరిదాస్ మాదిగ, జి. నవీన్ మాదిగ, సంతోష్ మాదిగ, నాగేష్ మాదిగ, వినోద్ మాదిగ, గణేష్ మాదిగ, నర్సింలు మాదిగ, నితిన్ మాదిగ తదితరులు ఉన్నారు.విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *