Breaking News

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల్లో నాణ్యత పాటించాలి

మద్నూర్‌లో నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

క్యూరింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచన

మద్నూర్, అక్టోబర్ 13 (E6tv NEWS).

జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రస్తుతం వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, వాతావరణం పొడిగా ఉండటంతో నిర్మాణ పనుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హన్మంత్ షిండే పేర్కొన్నారు. ముఖ్యంగా కాంక్రీట్ పనుల అనంతరం నిర్వహించే క్యూరింగ్ ప్రక్రియను నిరంతరం, పద్ధతి ప్రకారం చేపట్టాలని సూచించారు. సరైన క్యూరింగ్‌తోనే భవనం పటిష్టంగా ఉండటంతో పాటు నిర్మాణ నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిష్టాత్మక సమీకృత పాఠశాల నిర్మాణంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్ణీత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *