Breaking News

విజయవాడలో ఓటర్లను ఆకట్టుకుంటున్న వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి!

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి 19, 20, 21 డివిజన్లలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కార్పొరేటర్ అభ్యర్థి శెట్టి కందుర్గాప్రసాద్‌తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.

గతంలో వైసీపీ పాలనలోనే విజయవాడ నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, తాను మేయర్‌గా చేపట్టిన అభివృద్ధి పనులే తనకు శ్రీరామరక్ష అని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. నగర సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు మరోసారి వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని, తమ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు హోరాహారీగా సాగిస్తున్న ఈ ప్రచారంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *