Breaking News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం

భిక్కనూర్‌లో ముగ్గు పోసే కార్యక్రమం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 13 (E6tv న్యూస్: ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని భిక్కనూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు మంగళవారం భిక్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోసే కార్యక్రమాన్ని నిర్వహించారు.పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాకలి సాయిలు, ఉపసర్పంచ్ మ్యాతారి ఆంధ్రయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి స్వప్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయిని నారాయణ, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, సీనియర్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *