రూ. 27.65 కోట్ల అక్రమార్జన కేసు: రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణకు రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు!
హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసులో తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (REDCO) డివిజనల్ ఇంజనీర్ (DE) ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం గురువారం ఉదయం ఆయనను చంచల్‌గూడ జైలుకు పంపారు. భారీగా బయటపడ్డ అక్రమాస్తులు — మార్కెట్ విలువ మరింత ఎక్కువే! బుధవారం నాడు వెంకటరమణ ఇల్లు, కార్యాలయం మరియు ఆయన బంధువులు,…

