దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ
జగిత్యాల, అక్టోబర్ 31 (E6tv న్యూస్).
భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో శనివారం పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధానిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 565కు పైగా సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసి అఖండ భారతదేశ నిర్మాణానికి పునాదులు వేశారని తెలిపారు. అందుకే ఆయనను ఉక్కుమనిషి, భారత బిస్మార్క్గా పిలుస్తారని పేర్కొన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలో ఆయన చూపిన చొరవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పటేల్ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బీసీ నాయకులు వెన్న మహేష్, బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుంటి గంగారాం, 7వ వార్డు కౌన్సిలర్ కోరుకంటి రాము, ద్యావనపెల్లి శంకర్, శ్రీమంతుల హనుమల్లు, యుడుగిరి యాదిరెడ్డి, కాసారపు సతీష్ గౌడ్, బందెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
