అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బొంబోతుల లింగాగౌడ్‌కు ఘన సన్మానం
కామారెడ్డి, అక్టోబర్ 8 (E6tv NEWS: ప్రతినిధి)
అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బొంబోతుల లింగాగౌడ్‌ను జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగాగౌడ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కరోళ్ల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించడంలో సొసైటీ కీలక పాత్ర పోషించాలని కోరారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సొసైటీ సేవలు రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.సన్మానానికి స్పందించిన బొంబోతుల లింగాగౌడ్ మాట్లాడుతూ.. రైతులు, సొసైటీ సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రైతుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సొసైటీ అభివృద్ధితో పాటు రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు బొంబోతుల నరేష్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, ఇందూరి సిద్ధాగౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, మొగుళ్ల రామాగౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, జంగంపల్లి బాలకిషన్ గౌడ్, దేవేందర్ గౌడ్, స్వామి గౌడ్, అధికం నర్సాగౌడ్, రేవన్ గౌడ్‌తో పాటు పలువురు గౌడ ప్రముఖులు, రైతు ప్రతినిధులు, సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
