Breaking News

దాచేపల్లిలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం!

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే నామినేషన్ కేంద్రాలను మార్చివేస్తూ తమ పార్టీ అభ్యర్థులను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

మున్సిపల్ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకోవడంతో పాటు, పలువురిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా నామినేషన్లు వేసే వాతావరణాన్ని అధికారులు కల్పించాలని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, రాత్రికి రాత్రే నామినేషన్ కేంద్రాల మార్పులపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ఎన్నికల్లో తమ అభ్యర్థుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, ప్రతి చర్యకు తగిన ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *