Breaking News

కోరుట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సస్పెండ్

కోరుట్ల, అక్టోబర్ 31 (E6tv న్యూస్).

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా లోపాల కారణంగా జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్ 31న జిల్లా కలెక్టర్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన, సిబ్బంది పర్యవేక్షణతో పాటు రోగులకు నిరంతర వైద్య సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కలిగిన అధికారి అనుమతి లేకుండా విధులకు హాజరుకాకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు సగం మందికి ఒకేసారి సెలవులు మంజూరు చేసినట్లు గుర్తించారు. దీనివల్ల ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడకపోవడం పరిపాలనా నిర్లక్ష్యంగా, పర్యవేక్షణ లోపంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది తగిన సంఖ్యలో అందుబాటులో ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో విధుల నిర్వహణలో గుర్తించిన లోపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డాక్టర్ వి. సునీతారాణిని సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లేదా క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *