పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ.. రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో భాగంగా రన్
నిజామాబాద్, అక్టోబర్ 31 (E6tv NEWS:శివ ఠాకూర్).
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా రన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
నిజామాబాద్ నగరంలోని కోర్టు చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు కొనసాగింది. అనంతరం పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ.. దేశం, సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతున్నారని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రాజ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ధరణి, శేఖర్ బాబు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీను, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



