ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ప్రచారం
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 31 (E6tv న్యూస్).
చెన్నేకొత్తపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల ఎంపీటీసీ-1 స్థానం టీడీపీ అభ్యర్థి మాడెం సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థిని ఎం. శివలక్ష్మికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
మండల పరిధిలోని చిన్నపల్లి, ఎస్టీ కాలనీ, ఎర్రంపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ అభ్యర్థి మాడెం సూర్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థిని ఎం. శివలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ స్థాయి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
