Breaking News

ఆస్తి వివాదం.. తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు

పెట్రోల్ బంకు విషయంలో తలెత్తిన గొడవే హత్యకు కారణమా?

ధర్మపురి, అక్టోబర్ 31 (E6tv న్యూస్):l.

ఆస్తి వివాదాలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కన్నతండ్రినే కుమారుడు కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

ధర్మపురి మండలం నెరెళ్ల గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్ (55)ను ఆయన కుమారుడు మేడిపల్లి లక్ష్మణ్ (36) శనివారం కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.గత కొంతకాలంగా ఆస్తి విషయమై తండ్రీకొడుకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరు పెట్రోల్ బంకును నిర్మించగా, దానికి సంబంధించిన వ్యవహారాలపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం మరోసారి వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన లక్ష్మణ్ కర్రతో తండ్రిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *