Breaking News

బీజేపీలో కీలక పదవి వార్తలపై స్పందించిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీలో త్వరలో కీలక పదవి అప్పగిస్తారంటూ సాగుతున్న ప్రచారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించిన ‘సేవా జ్యోతి’ ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ భూ వివాదాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నది నాటకమేనని, ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు. అలాగే ‘ఓట్ చోరీ, సీట్ చోరీ’ల పేటెంట్ కాంగ్రెస్‌దేనని ఆరోపిస్తూ, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని బదనాం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేల మంది రోహింగ్యాల ఓట్లు ఉన్నాయని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *