Breaking News

మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి మరియు 6 వరసల రహదారి నిర్మాణానికి రూ. 1,108.27 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు (GO Rt No. 928) జారీ చేసింది. దీనిలో రూ. 948.65 కోట్లను రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణితో కూడిన భారీ ఆలయ సముదాయ నిర్మాణానికి, మిగిలిన రూ. 159.62 కోట్లను ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు 2.5 కిలోమీటర్ల పొడవునా 100 అడుగుల (30 మీటర్ల) వెడల్పుగల 6 వరసల రహదారి నిర్మాణానికి కేటాయించింది. దీనితో పాటు రూ. 700 కోట్ల ఆలయ నిర్మాణ డిజైన్లు, డీపీఆర్‌లు, టెండర్ల మార్గదర్శకత్వం కోసం ఆర్‌ అండ్‌ బి ఈఎన్సీ ఛైర్మన్‌గా ప్రత్యేక సాంకేతిక కమిటీని (GO Rt No. 929) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *