Breaking News

మన దేశపు ధనికుల ఆదాయం ఎంతంటే?గణాంకాలతో ప్రపంచ బ్యాంకు…

అమెరికా, కెనడా, జర్మనీ వంటి సంపన్న దేశాల్లోని దిగువ 10 శాతం ప్రజల ఆదాయ స్థాయి.. మన దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న (ఎగువ) 10 శాతం మంది స్థాయిని మించిపోయినట్లు ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. భారత్‌లో ఎగువ 10 శాతం ప్రజల రోజువారీ వినియోగ స్థాయి సుమారు 10 డాలర్లుగా ఉండగా.. అమెరికాలో దిగువ 10 శాతం ప్రజల స్థాయి 25 డాలర్లుగా, కెనడాలో 31 డాలర్లుగా ఉంది. దేశాల మధ్య జీవన ప్రమాణాలు, జీవన వ్యయాల్లో ఉన్న ఈ భారీ వ్యత్యాసాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఆదాయాలు, ఉత్పాదకత పెరగాలని, మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *