తెలంగాణలో తరచూ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారకపోవడంపై అధికారులపై నిప్పులు చెరిగారు. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జెన్కో సీఎండీలను సైతం సస్పెండ్ చేయడానికి వెనుకాడబోనని తీవ్రంగా హెచ్చరించారు. బొగ్గు సరఫరా ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అధికారులను నిలదీశారు. కరెంట్ కోతలకు కారణాలపై నివేదిక ఇవ్వాలని, సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తేవాలని ఆదేశించారు.
మరోవైపు, యూకే మేయర్ల ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించి, డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న “ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026″కు హాజరుకావాలని వారిని ఆహ్వానించారు.
