విజయవాడ పున్నమిఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి జాతీయ సరస్ మేళాను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి ముర్ము జీవితం దేశంలోని ప్రతీ మహిళకు ఆదర్శమని కొనియాడారు. గ్రామీణ మహిళల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, వారి ఉత్పత్తులకు జాతీయ గుర్తింపు కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉమ్మడి ఏపీలో తాను ప్రారంభించిన డ్వాక్రా ఉద్యమం నేడు అద్భుతమైన ఫలితాలనిస్తోందని, భవిష్యత్తులో డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ. 10 లక్షల కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను కేవలం మహిళా సంఘాలుగా కాకుండా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. రాబోయే రోజుల్లో ప్రతీ ఇంటి నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని పిలుపునిచ్చారు.
సరస్ మేళాలో…ప్రతి ఇంటా మహిళా పారిశ్రామికవేత్త ఉండాలి – చంద్రబాబు!
