Breaking News

‘తిరంగా’ మార్చ్:సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే అరెస్ట్!

ఢిల్లీలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగ’ (తిరంగా మార్చ్) నిరసన ప్రదర్శనకు ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీ కరొల్ బాఘ్‌లోని ఎన్‌సీపీ (శరద్ పవార్) అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసంలో ఉన్న దిప్కేను పోలీసులు ముందస్తుగా డిటైన్ చేసి తీసుకెళ్లారు.

  • నోటీసులు ఇచ్చి అరెస్ట్: కన్నాట్ ప్లేస్‌లో ఎలాంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదంటూ శుక్రవారం ఉదయం పోలీసులు దిప్కేకు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
  • ‘జాతీయ జెండా ఎగురవేస్తే తప్పా?’: డిటైన్ చేసే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన దిప్కే పోలీసులను నిలదీశారు. “మేం ఎలాంటి నిరసన తెలుపుతామని అనలేదు… కేవలం జాతీయ జెండా (తిరంగా) ప్రదర్శిస్తామన్నాం. అది కూడా ఈ దేశంలో నిషేధమా? జాతీయ జెండా ఎగురవేస్తే నేరమవుతుందా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా జమ్మూ కాశ్మీర్ బలగాలతో సహా భారీగా పోలీసులను మోహరిస్తున్నారని ఆరోపించారు.
  • కన్నాట్ ప్లేస్ వద్ద భారీ బందోబస్తు: అభిజీత్ దిప్కే అరెస్ట్ అనంతరం కన్నాట్ ప్లేస్, సెంతటివ్ పార్క్ సమీపంలో భారీగా మోహరించిన పోలీసులు.. అక్కడకు చేరుకుంటున్న ప్రదర్శనకారులను, జనసమూహాలను చెదరగొట్టారు.

ఆందోళనల నేపథ్యం: ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల ఇదే అంశంపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి అరెస్ట్ అయిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల అరెస్ట్‌ను నిరసిస్తూ ‘లెహ్రా దో తిరంగ’ పిలుపునిచ్చారు.

జంతర్ మంతర్‌ను నిరసనల ప్రాంతంగా రద్దు చేయడంతో కన్నాట్ ప్లేస్ వద్ద ఈ మార్చ్ నిర్వహించేందుకు సీజేపీ ప్రయత్నించగా, ఐసా (AISA), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు కూడా ఇక్కడే నిరసనలకు పిలుపునివ్వడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *