Breaking News

భగత్ సింగ్ త్యాగం చిరస్మరణీయం: మంత్రి సవిత

పెనుకొండ, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి)

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ విగ్రహానికి మంత్రి సవితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, ఆయన చూపిన ధైర్యం, నిస్వార్థ దేశభక్తి చిరస్మరణీయమని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు.భగత్ సింగ్ ఆశయాలు, దేశభక్తి నేటి తరానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని మంత్రి అన్నారు. యువత దేశ ప్రగతి, సమాజ హితం కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయడమే అమరవీరులకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *