జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI2030) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. బోయింగ్ 787-9 రకానికి చెందిన ఈ విమానాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి, వెంటనే భద్రతా తనిఖీల కోసం ప్రత్యేక నిఘా విభాగం (Isolation Bay) వద్దకు తరలించారు. విమానం ముంబై ఎయిర్‌స్పేస్‌లో ఉన్న సమయంలో పైలట్ ‘స్క్వాక్ కోడ్ 7500’ (అనాధికారిక జోక్యం/ముప్పు) నొక్కినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే పూర్తి వివరాలు మరియు తనిఖీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
