Breaking News

కాన్షీరామ్ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బహుజన నాయకుల సేవా కార్యక్రమం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 09 (E6tv NEWS: ప్రతినిధి).

బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోగులకు పండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బహుజనులు తమ ఓటు శక్తితో రాజ్యాధికారాన్ని సాధించి, పాలించే వర్గంగా ఎదగాలన్నది కాన్షీరామ్ ఆశయమని పేర్కొన్నారు. బహుజనుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ బహుజనుల ఐక్యత, సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడు మర్లు సాయిబాబు, ఉపాధ్యక్షుడు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *