Breaking News

భీంగల్ 10వ వార్డులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి

)భీంగల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే లత, జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్రబాబు, అనంతరావు, తోట సతీష్, సంధ్య నాయక్, 10వ వార్డు అధ్యక్షుడు పత్రి రాజు, వార్డు ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని కార్యక్రమంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *