Breaking News

23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ

రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 23 అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్నారులు వినియోగించుకునే వివిధ రకాల ఆట వస్తువులు, మ్యాట్లు అందించడం సంతోషకరమని తెలిపారు.ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సాయికుమార్‌ను లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ లయన్ గణపురం అశోక్, రీజియన్ చైర్మన్ లయన్ తన్నీరు సుబ్బారావు, క్లబ్ అధ్యక్షులు గుండూరు ప్రశాంత్ గౌడ్, కార్యదర్శి గెంటెల గంగాధర్, కోశాధికారులు పార్వతి, ప్రశాంత్, జీఎస్టీ కోఆర్డినేటర్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా చైర్మన్ కె.వి. మోహన్, డైరెక్టర్లు కొత్తపల్లి రవి కిరణ్, ముద్దసాని రాజు, తోట్ల కిరణ్ కుమార్, ఐసీడీఎస్ గ్రేడ్-1 సూపర్‌వైజర్ భాశెట్టి శృతి, శివకుమార్, వినయ్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 23 అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *