Breaking News

సింగరేణి కార్మికులకు పండుగ ధమాకా: రూ. 1.10 లక్షల బోనస్!

రానున్న దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రదర్శన అనుసంధానిత ప్రోత్సాహకం (PLR) కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున పండుగ బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ దేశానికి, తెలంగాణ అభివృద్ధికి వెలుగులు పంచుతున్న కార్మికుల కృషి వెలకట్టలేనిదని, తెలంగాణకు సింగరేణి ‘కొంగు బంగారం’ వంటిదని కొనియాడిన ఆయన, గతేడాది ఇచ్చిన రూ. 1,03,000 కంటే ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచినట్లు తెలిపారు. ఇదే సమయంలో సంస్థ సంక్షేమం, సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ. 60,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *