మెట్పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్):
మెట్పల్లి పట్టణంలోని వాసవీమాత ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు గంగం అజయ్ కుమార్కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలు మాట్లాడుతూ.. గంగం అజయ్ కుమార్ ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి, వాసవీమాత ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.అనంతరం గంగం అజయ్ కుమార్ను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కోట కిరణ్, జొన్నల శ్రీను, బండారి గోపి, పుల్లూరి నవీన్, చాడ చందు, ఎలిమి రవి, వాసవీమాత ఆలయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
