జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవ చేసేందుకు తమ పార్టీ తెలంగాణ రక్షణ సేనలోకి రావలసిందిగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటనలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, లోకం మార్పు కోసం పోరాడిన మాజీ మావోయిస్టులకు తమ పార్టీ ఒక సరైన వేదిక కాగలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కవిత, ఆగమశాస్త్ర విరుద్ధంగా కాంక్రీట్ వాడటాన్ని తప్పుపడుతూ కృష్ణశిలలతోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజన్న ఆలయ గోశాలలో సరైన మేత, నీరు లేక గోవులు మృతి చెందడంపై తీవ్ర వేదన వ్యక్తం చేసిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం దిశానిర్దేశం కోల్పోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల వైపు చూస్తున్నారని విమర్శించారు.
మాజీ మావోయిస్టులకు కవిత పిలుపు..
