Breaking News

గోషామహల్‌లో ఓట్ల తొలగింపు కుట్ర: అసదుద్దీన్

హైదరాబాద్‌లోని గోషామహల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ నంబర్లు 28, 30, 127లలో 2002 సంవత్సరం నుంచి ఓటు హక్కు కలిగిన ముస్లింల పేర్లను తొలగించేందుకు ముందస్తుగా ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని విమర్శించారు. ఒకే వ్యక్తి 122 ఫారం-7 దరఖాస్తులను బల్క్‌గా ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించిన ఒవైసీ, ఈ కుట్ర వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్న బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *