Breaking News

జమ్మలమడుగులో మెగా మెడికల్ క్యాంపు ప్రారంభం

జమ్మలమడుగు, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి).

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా ప్రస్థానం, పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఉత్సవాల్లో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.

రోటరీ క్లబ్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ, జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. మెగా మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

కార్యక్రమంలో వైద్యులు, ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *