బిచ్కుంద, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని బిచ్కుంద బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు అన్నారు.
బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం దోబీవాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న గుడ్లు, పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు రాజిరెడ్డి, మసాని సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు జుట్టు సాయిలు, గాన్న సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




