CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి – కాంగ్రెస్ నాయకుల డిమాండ్
నిర్మల్, అక్టోబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి)
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ” నిరసన ర్యాలీలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. AICC పిలుపు మేరకు, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్మల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిర్మల్ DCC అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ SIR కో-ఆర్డినేటర్ తహార్ బిన్ అందాని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ కాంగ్రెస్ శ్రేణుల నినాదాల మధ్య కాలినడకన RDO కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన రాస్తారోకోలో నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపడుతోందని నాయకులు పేర్కొన్నారు.
