Breaking News

ఎర్రవల్లి 45 ఎకరాల లెక్క తేల్చాలని రేవంత్ ఆదేశం

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ (MCRHRD)లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి సర్వే నంబర్ 325 పరిధిలో రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన ప్రాథమిక సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని, మిగిలిన 45 ఎకరాల వ్యత్యాసం ఉందో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ వ్యత్యాసం ఉన్న భూమి మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కలిసిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవ్వడంతో, ఆ భూమి ఎక్కడుందో స్పష్టంగా తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సమగ్ర సరిహద్దు సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా, కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పొరుగున ఉన్న భూ యజమానులకు యాజమాన్య హక్కుల పత్రాల పరిశీలన నిమిత్తం నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *