జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచన
వేల్పూర్, సెప్టెంబర్ 15: (E6 టీవీ న్యూస్).
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమున వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ. 2 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు.
ఈ మేరకు ఎల్‌ఓసీ పత్రం కాపీని వేల్పూర్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. జాన జమునకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు.బాధితురాలు జాన జమున త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించడం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

