మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి తొలి అడుగు

ఆలయాన్ని సందర్శించి అంచనాల తయారీకి కొలతలు తీసుకున్న దేవాదాయ శాఖ అధికారులు

బాల్కొండ, అక్టోబర్ 15: (E6 టీవీ న్యూస్).

బాల్కొండ మండల కేంద్రంలో వేలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక శోభను చాటుతున్న మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రమేష్, స్థపతి వెంకటేష్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయంలోని విగ్రహాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి, పునర్నిర్మాణ పనులకు అవసరమైన అంచనాలు (ఎస్టిమేట్లు) రూపొందించేందుకు కొలతలు తీసుకున్నారు. ఆలయ నిర్మాణ పరిస్థితులను పరిశీలించి, అవసరమైన పనుల వివరాలను అంచనా వేసే ప్రక్రియను ప్రారంభించారు.

ఎస్టిమేట్లకు అనుగుణంగా నిధులు జమ చేయాలి

ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి దేవాదాయ శాఖ రూపొందించే అంచనాలకు అనుగుణంగా అవసరమైన డిపాజిట్లు తక్షణమే చెల్లించాలని అధికారులు సూచించారు. తద్వారా పునర్నిర్మాణ పనులకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని తెలిపారు.మార్కండేయ మందిర పునర్నిర్మాణం కోసం అధికారులు ఆలయాన్ని సందర్శించి కొలతలు తీసుకోవడంపై స్థానికులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సందర్శనలో పాల్గొన్న సంఘం ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు అంద వెంకటగిరి, కోశాధికారి కుందారపు శ్రీనివాస్, కార్యదర్శి మేక నాగేష్, మైసరి పెద్ద గంగాధర్, భోగ గంగా కిషన్, బోగా భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *