మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రవి
కుబీర్, సెప్టెంబర్ 29: (E6tv NEWS: ప్రతినిధి) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కుబీర్ మండలానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు రవి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంగళవారం పాల్సి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ మండల నాయకుడు రవి, మాజీ ఎమ్మెల్యే జి. విట్టల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, లోకేశ్వరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్తా గౌడ్, వార్డు సభ్యులు కామాజి, పాల రాకేష్, తోట రవి, తోట దత్తు, పోతన్న, మడన్న, సాయినాథ్, పవన్, మాజీ సర్పంచులు శ్రవణ్, దత్తు గౌడ్‌తో పాటు మండల స్థాయి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విలేకరి: రిజ్వాన్ అహ్మద్
