Breaking News

భైంసాలో రేపటి ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

అనివార్య కారణాలతో సెప్టెంబర్ 30న జరగాల్సిన కార్యక్రమం వాయిదా

భైంసా, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 30న భైంసా క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల (IPS) పర్యవేక్షణలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అనివార్య పరిస్థితుల కారణంగా సెప్టెంబర్ 30, బుధవారం భైంసాలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.ఈ విషయాన్ని భైంసా, పరిసర ప్రాంతాల ప్రజలు గమనించాలని జిల్లా పోలీసులు కోరారు.

విలేకరి: రిజ్వాన్ అహ్మద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *