బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా షేక్ మతీన్ నియామకం

తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటన

రుద్రూర్, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామానికి చెందిన షేక్ మతీన్‌కు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయనను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించినట్లు షేక్ మతీన్ సోమవారం వెల్లడించారు.

ఈ సందర్భంగా షేక్ మతీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

షేక్ మతీన్ నియామకం పట్ల రుద్రూర్ మండల నాయకులు, కార్యకర్తలు, రాయకూర్ క్యాంపు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *