మోర్తాడ్ మండలంలో ఆత్మీయులను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)

మోర్తాడ్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను, అనారోగ్యంతో బాధపడుతున్న ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ధర్మోరా గ్రామంలో సాయన్న మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉషన్న మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ నాయకుడు రాహుల్ అమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దొన్కల్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కల్లెడ గంగాధర్ తల్లి, కత్తి రాజన్న తల్లి, గడ్డం హన్మాండ్లు తమ్ముడు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఆత్మీయుడు వెంగంటి శ్రీనాథ్‌కు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ జరగడంతో ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌వీ నాయకుడు దేవ్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను పరామర్శించారు. దొన్పాల్ గ్రామంలో వార్డు మెంబర్ గంగమోహన్ తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సర్పంచ్ రాజారెడ్డిని కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

సుంకేట్ గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకుడు సత్యనారాయణ అన్న, బీఆర్‌ఎస్ నాయకుడు లింబాద్రి తల్లి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *