Breaking News

ఎమ్మెల్యే పోచారం అండదండలతో సొసైటీని అభివృద్ధి చేస్తాం

రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు

కోటగిరి, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి)

బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావుతో పాటు 12 మంది పాలకవర్గ సభ్యులతో సంఘం పర్సన్ ఇన్‌చార్జి రియాజుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.పాలకవర్గ సభ్యులుగా కమలావార్ వెంకటేష్, మన్నె సాయిలు, అగ్గు హనుమంతు, మేతరి లస్మవ్వ, బొనిగే శ్యాంసుందర్, ఆలపాటి లక్ష్మి, జి. సరస్వతి, జి. తుక్కమ్మ, ఆర్. రాధిక, బోధన్ ఆనంద్, ఎం. ఫణికుమార్, హెచ్. అశోక్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సంఘ పరిధిలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సహకార సంఘం సిబ్బంది నూతన పాలకవర్గాన్ని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గత కొంతకాలంగా పర్సన్ ఇన్‌చార్జిగా సేవలందించిన రియాజుద్దీన్‌ను నూతన పాలకవర్గ సభ్యులు సత్కరించారు.

నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. “రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో పాలకవర్గం పనిచేస్తుంది. రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు.

మాజీ సర్పంచ్ ఆనంద్ మాట్లాడుతూ.. సహకార సంఘం ద్వారా రైతులకు కాలానుగుణంగా అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి లాభాల బాటలో నడిపించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంఘ పరిధిలోని సర్పంచులు రొట్టె పుష్పభాయి విఠల్, ఎస్.కె. గౌస్, గైని వీరమణి అర్జున్, బి. అనిత చందు, ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *