Breaking News

శివపూర్‌లో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: నాయకులు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్).

ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం కల్పిస్తున్న కొనుగోలు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పీఏసీఎస్ డైరెక్టర్లు, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే సంబంధిత మూడు గ్రామాల సర్పంచులు, నాగరాజు, సాయిలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ఎల్లారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి సతీష్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *