Breaking News

కోటియాలో పంచాయతీ ఎన్నికలు.. సుప్రీంకోర్టులో ఒడిశా పిటిషన్!

వివాదాస్పద కోటియా ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ధిక్కరణ (కంటెంప్ట్) పిటిషన్ దాఖలు చేసింది. ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి శనివారం ఈ వివరాలను వెల్లడించారు.

కొరాపుట్ జిల్లాలోని కోటియా క్లస్టర్ గ్రామాల్లో జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆమోదంతో కొరాపుట్ జిల్లా కలెక్టర్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కోటియా గ్రామ పంచాయతీ పరిధిలోని 28 గ్రామాలు ఒడిశా అధీనంలోనే ఉన్నాయని, అయితే 21 గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ హక్కు చేస్తోందని పేర్కొన్నారు. ఈ వివాదంపై 1968లో ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2006లో ఇరు రాష్ట్రాలు స్టేటస్ కో (యథాతథ స్థితి) పాటించాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.

అయితే, ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని ఒడిశా మంత్రి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రధాన కార్యదర్శి, సంబంధిత జిల్లా కలెక్టర్లను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చినట్లు తెలిపారు. కోటియా ఒడిశాలో అంతర్భాగమని స్పష్టం చేసిన ఆయన, రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *