అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం, అక్టోబర్ 13 (E6 NEWS ప్రతినిధి)
రామచంద్రపురం 2,6,8వ డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువు వద్ద కొలువుదీరిన దుర్గామాతకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఇక్కడ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆదర్శ్ రెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలందించారు.
అనంతరం కానుకుంటలో అన్నపూర్ణాదేవి రూపంలో కొలువుదీరిన దుర్గామాతను మండప కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆదర్శ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మండప కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని దుర్గామాతను ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్కిల్ అధ్యక్షుడు పరమేష్, జగన్నాథ్ రెడ్డి, అప్పల భాస్కర్, గడ్డం కుమార్, మద్దూరు శ్రీకాంత్ రెడ్డి, రాములు యాదవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.




